టైటిల్ : లెనిన్‌
నటీనటులు : అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే, ప్రమోద్, శివాజీ, బ్రహ్మాజీ, ఈశ్వరి రావు, శత్రు తదితరులు
సినిమాటోగ్ర‌ఫీ : లియోన్ బ్రిట్టో
ఎడిటింగ్ : నవీన్ నూలి
మ్యూజిక్‌ : థమన్ ఎస్
నిర్మాతలు : నాగార్జున, సూర్యదేవర నాగవంశీ
దర్శకత్వం : మురళీ కిషోర్ అబ్బూరు
రిలీజ్ డేట్ : 10 జూలై, 2026

అక్కినేని న‌వ మ‌న్మ‌థుడు అఖిల్‌కు అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శ‌ని అన్న‌ట్టుగా కెరీర్ ఉంది. అందంగా ఉంటాడు.. న‌ట‌న‌లో మంచి టాలెంట్ ఉంది. డ్యాన్సులు కుమ్మేస్తాడు.. ఫైట్ల‌లో ఇర‌గ‌దీస్తాడు.. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 10 ఏళ్లు దాటుతున్నా.. ఇంకా ఒక్క హిట్ ప‌డ‌లేదు. సినిమా కెరీర్ అంతా డ‌ల్‌గా సాగుతోంది. పైగా అన్న‌పూర్ణ లాంటి బ్యాకింగ్ ఉన్నా.. కోట్లాది మంది అభిమానుల అండ ఉన్నా హిట్ కోసం ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఫ‌లించ‌డం లేదు. ఏజెంట్ త‌ర్వాత రెండేళ్ల స‌మ‌యం తీసుకుని తాజాగా లెనిన్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన లెనిన్ సినిమాపై ట్రైల‌ర్‌తో ఈ సారి అఖిల్ హిట్ కొట్టేస్తున్నాడ‌న్న పాజిటివ్ బ‌జ్ క్రియేట్ అయ్యింది. మ‌రి లెనిన్ ఎలా ఉందో ఇండియాహెరాల్డ్‌.కామ్ స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థ :
అనాథ అయిన లెనిన్ ( అఖిల్ ) చిన్న‌ప్పుడే శ్రీరామ‌పురం ఊర్లో అడుగు పెడ‌తాడు. ఆ గ్రామంలో అఖిల్‌కు వ‌సంత్ (ప్రమోద్ పంజు) తో ప‌రిచ‌యం ఇద్ద‌రు ప్రాణ స్నేహితులు అవుతారు. ఈ క్ర‌మంలోనే అదే గ్రామానికి చెందిన భార‌తి ( భాగ్యశ్రీ బోర్సే)తో ప్రేమ‌లో ప‌డ‌గా... ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డ‌తారు. ప్ర‌తి యేటా ఆ గ్రామంలో జ‌రిగే జాత‌ర‌లో ర‌క్త‌పు బొట్టు కింద ప‌డితే గ్రామానికి అరిష్టం అన్న న‌మ్మ‌కం ఉంటుంది. జాత‌ర పెత్త‌నం అంతా తానే చేయాల‌ని భావించే ఎతిరాజు ( శివాజీ), ఎప్పుడు ఆ గ్రామం నాశ‌నం అవ్వాల‌నుకునే శ‌కుని ( బ్ర‌హ్మాజీ) వ‌ల్ల జాత‌ర‌లో ఏం జ‌రిగింది ? తన ప్రాణ స్నేహితుడు వ‌సంత్‌పై లెనిన్‌కు ఉన్న ప‌గ ఏంటి ?  తాను ప్రాణంగా ప్రేమించిన భార‌తికి ఎందుకు దూర‌మ‌య్యాడు ? ఆమె ప్రేమ ద‌క్కించుకున్నాడా ? ఈ క‌థ‌లో లెనిన్ ఎవ‌రెవ‌రితో యుద్ధం చేశాడు ? అన్న‌దే ఈ సినిమా.

విశ్లేష‌ణ :
లెనిన్ మామూలు స్టోరీయే అయినా కీల‌క‌టైంలో దీని రేంజ్ మారుతుంటుంది. అందుకే నాగార్జున కూడా ఈ క‌థ‌ను మ‌హాభార‌తంతో పోల్చి సినిమాపై అంచ‌నాలు పెంచేశారు. మ‌హాభార‌తానికి చెందిన కొన్ని రిఫ‌రెన్సులు కూడా ఈ క‌థ‌లో క‌నిపిస్తాయి. సినిమా స్టార్ట్ అయిన వెంట‌నే క‌థ‌లోకి వెళ్ల‌డానికి.. డ్రామా మొద‌ల‌య్యేందుకు కాస్త టైం ప‌డుతుంది. హీరో, హీరోయిన్ ప్రేమ కూడా రొటీన్‌గానే ఉంది. ఇంట‌ర్వెల్ నుంచి క‌థ ఒక్క‌సారిగా ట‌ర్న్ తీసుకుంటుంది. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న కంప్లైంట్లు అన్నీ ప్రేక్ష‌కులు మ‌ర్చిపోయి సెకండాఫ్‌ను ఎంజాయ్ చేస్తూ ప్రేక్ష‌కులు అనుభూతి పొందుతారు. సెకండాఫ్‌లో క‌థ‌లో ఉన్న సీరియ‌స్ టోన్ రివీల్ అవుతుంది. క‌థలో మెయిన్ విల‌న్ ఎవ‌రో తెలిశాక ద‌ర్శ‌కుడు క‌థ‌ను న‌డిపించి ప్రేక్ష‌కుల‌కు మంచి అనుభూతి పంచాడు. క్లైమాక్స్‌లో షాకింగ్ ట్విస్ట్ అదిరిపోతుంది. సినిమాకు సెకండాఫ్ బ‌లం. క‌థ‌నంతో పాటు పాత్ర‌లు స‌డెన్‌గా మారిపోవ‌డం, సినిమాలో ప్ర‌తి పాత్రా సినిమాకు ప్ల‌స్ పాయింట్ కావ‌డం బాగుంది. సినిమాలో పాట‌లు బాగున్నా ప్లేస్‌మెంట్స్ విష‌యంలో ఇంకా బాగా ప్లాన్ చేసుకోవాల్సింది.

న‌టీన‌టుల ప‌నితీరు :
సినిమా మొత్తానికి అఖిల్ న‌ట‌న హైలెట్‌. అఖిల్ నుంచి ప్రేక్ష‌కులు ఈ స్థాయిలో విశ్వ‌రూపం చూపించే న‌ట‌న ఎవ్వ‌రూ ఊహించ‌రు. అఖిల్ పాత్ర‌లో లీన‌మైన మ‌రీ న‌టించాడు. ప్రీ క్లైమాక్స్‌లో ఎమోష‌న‌ల్ పెర్పామెన్స్‌లో న‌టుడిగా మ‌రో మెట్టు ఎక్కిన‌ట్టే ఉంది. ఈ పాత్ర కోసం చాలా మారాడు.. త‌న లుక్ కూడా మార్చుకున్నాడు. యాస బాగుంది. హీరోయిన్ భాగ్య‌శ్రీ అందంతో పాటు సినిమాలో త‌న పాత్ర‌ను క్యారీ చేస్తూ ర‌క్తిక‌ట్టించింది. స‌లార్ న‌టుడు అఖిల్‌కు బెస్ట్ ఫ్రెండ్‌గా సినిమాలో చేసిన నెగ‌టివ్ రోల్ ఖ‌చ్చితంగా స‌ర్‌ప్రైజింగ్గా ఉంటుంది. పై న‌టుల‌తో పాటు శివాజీ ఒక‌టి రెండు సీన్ల‌లో రెచ్చిపోయాడు. ఈశ్వరి రావు, బ్రహ్మాజీ, శత్రు పాత్ర‌ల వ‌ర‌కు బాగా న‌టించారు. కొన్ని ట్విస్ట్ లు కూడా బాగా వర్కవుట్ అయ్యాయి.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్ :
టెక్నిక‌ల్ టీం ఈ సినిమాకు బాగా ఎఫ‌ర్ట్ పెట్టి ప‌నిచేసింది. భారీ సెట్టింగుల మ‌ధ్య ఈ సినిమా తెర‌కెక్కించినా అలా అనిపించ‌దు. నేచుర‌ల్‌గా కెమేరా వ‌ర్క్‌తో గ్రామీణ నేప‌థ్యంలో తెర‌కెక్కే యాక్ష‌న్ డ్రామాగా సినిమాను తెర‌కెక్కించారు. థమన్ నేప‌థ్య సంగీతం కంటే పాట‌లు బాగున్నాయి. లియోన్ బ్రిట్టో కెమెరా వర్క్ చాలా బాగుంది. నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువ‌లు అవ‌స‌రాన్ని బ‌ట్టి ఖ‌ర్చు చేశారు. ఎక్కువ సీన్లు జాత‌ర‌లోనే తీశారు.  దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తాను రాసుకున్న‌ సబ్జెక్ట్‌ను క్లీయ‌ర్ విజ‌న్‌తో తెర‌మీద నీట్‌గా ఎస్టాబ్లిష్ చేశాడు. మంచి పాత్ర‌లు తీర్చిదిద్ది ప్ర‌జెంట్ చేసిన తీరు ప్రేక్ష‌కుల‌ను ఎంగేజ్ చేస్తుంది. కొన్ని రొటీన్ సీన్లు ప‌డినా త‌న వ‌ర్క్ ప్రేక్ష‌కుల‌ను ఇంప్రెస్ చేస్తుంది.

ఫైన‌ల్‌గా...
అఖిల్ కెరీర్‌లో ఫ‌స్ట్ సూప‌ర్ హిట్ సినిమాగా అఖిల్ నిలుస్తుంద‌న‌డంలో సందేహం లేదు. అఖిల్ కెరీర్ బెస్ట్ పెర్పామెన్స్, ద‌ర్శ‌కుడి విజ‌న్‌.. ఎమోష‌న్లు, ప‌ల్లెటూరి జాత‌ర నేప‌థ్యం, విల‌న్ షేడ్ మార్పు, హీరోయిన్ పాత్ర ఇవ‌న్నీ హైలెట్‌.. కొన్ని రొటీన్ సీన్లు ప‌క్క‌న పెడితే సినిమా అదిరిపోయింద‌నే చెప్పాలి. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కూడా అఖిల్ కెరీర్‌లోనే మంచి నెంబ‌ర్లు ప‌డే ఛాన్సులు ఉన్నాయి.

ఫైన‌ల్ పంచ్ :  బాక్సాఫీస్ ద‌గ్గ‌ర గ‌ర్జించిన లెనిన్‌

లెనిన్ రేటింగ్ : 3 / 5

మరింత సమాచారం తెలుసుకోండి: