బాలీవుడ్ లో
డ్రగ్స్ వ్యవహారం తీవ్ర స్థాయిలో దుమారం రేపుతుంది. ఈ
డ్రగ్స్ వ్యవహారంలో ఎవరిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది అనే దానిపై చాలా చర్చలు జరుగుతున్నాయి.
సుశాంత్ సింగ్ మరణం తర్వాత ఈ
డ్రగ్స్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. చివరికి
సుశాంత్ సింగ్ మరణం కూడా పక్కదారి పట్టింది. ఇక
టీవీ నటులను కూడా విచారిస్తున్నారు. ఇప్పటికే పలువురు
హీరోయిన్ లను కూడా విచారిస్తున్న సంగతి తెలిసింది.
రియా
చక్రవర్తి తో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరి మీద కూడా నార్కోటిక్స్
డ్రగ్స్ బ్యూరో ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఇక ఇదిలా ఉంటే... ముంబైలో
డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 30 ఏళ్ల
టీవీ నటిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో
అరెస్ట్ చేసింది అని అధికారులు పేర్కొన్నారు. ఆమెను రిమాండ్ కి తరలించి విచారిస్తున్నారు.