పద్నాలుగేళ్లకే ఆ చిన్నారి గర్భవతైంది. పురిటి నొప్పులతో ఇంట్లో ఎవరు లేని సమయంలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా నవజాత శిశువును తన తండ్రి గ్యారేజీలోని ఫ్రీజరులో దాచిపెట్టింది. ఈ దారుణ ఘటన రష్యాలోని సైబీరియా ప్రాంత నోవోసిబిర్కుస్ నగరానికి సమీపంలోని వర్ద్ తులా గ్రామంలో వెలుగుచూసింది.

అయితే తల్లిదండ్రులు ఇంట్లోకి వచ్చి చూసే సరికి రక్తస్రావం కనిపించింది. అదిచూసి ఆమె తల్లి కూతురును నిలదీసింది. దానికి ఆ బాలిక కడుపు నొప్పి అని చెప్పింది. అపెండిసైటిస్తో బాధపడుతుందేమోనని అంబులెన్సుకు ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించారు. తీరా ఆ బాలికను పరీక్షించిన వైద్యులు చిన్నారి డెలివరీ అయ్యినట్టు తెలిపారు. దానితో అసలు విషయం తల్లిదండ్రులు చెప్పేసింది. తాను జన్మనిచ్చిన నవజాత శిశువును ఫ్రీజరులో ఉంచానని చెప్పింది. వెంటనే అక్కడకు వెళ్లిచూడగా ఆ శిశువు మరణించి ఉంది. అయితే బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: