అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్వహించిన సుమారు 18 ఎన్నికల ర్యాలీలు దాదాపుగా 30,000 మందికి పైగా కరోనా వైరస్ బారిన పడటానికి దారితీశాయని మరియు 700 మందికి పైగా మరణాలకు దారి తీశాయని అంచనా వేసారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చేసిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం  ట్రంప్ ర్యాలీల కారణంగా కరోనా కేసులు పెరిగాయని వెల్లడించారు.

ఆయన పెద్ద పెద్ద బహిరంగ సభలు నిర్వహించారు. జూన్ 20 మరియు సెప్టెంబర్ 22 మధ్య ట్రంప్ నిర్వహించిన 18 ర్యాలీలను ఈ సర్వేలో పరిశోధకులు పరిశీలించారు. వారు అందరూ కూడా ఈ సమావేశాలకు హాజరు అయ్యారు అని సర్వే చెప్పింది. మాస్క్ లు సామాజిక దూరం వంటి అంశాలు జనాలు పెద్దగా పట్టించుకోలేదు అని అధికారులు వెల్లడించారు. ఇక కరోనా కేసులు అమెరికాలో ఇంకా పెరుగుతూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: