ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనేది ఉంటుందా...? అసలు ఏపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలి అని భావిస్తుంది...? స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఏపీ ఎన్నికల సంఘం ఎలా ముందుకు వెళ్తుంది అనే అనుమానాలు చాలానే ఉన్నాయి. ఈ తరుణంలో ఏపీ ఎన్నికల సంఘం నుంచి కీలక ప్రకటన వచ్చింది.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు మేం సిద్ధం అని ఏపీ ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది ఎస్‌ఈసీ.. ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీని హైకోర్ట్ వివరాలు అడిగింది. కరోనా తగ్గుముఖం పట్టినందున ఎన్నికలు నిర్వహణకు సిద్ధం అని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది.  కాగా మార్చ్ లో కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనేది ఆగిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: