జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. నియంత్రణ
రేఖ వద్ద కొంత మంది ముష్కరులు భారత భూభాగంలోకి చొరబాటుకు ప్రయత్నిస్తుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. ముష్కరులు చొరబాటుని భారత బలగాలు తిప్పికొట్టాయి. శనివారం అర్ధ రాత్రి నుంచి అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశాయి. మూకుమ్మడిగా వచ్చిన కొంత మంది ఉగ్రవాదులు దొంగదెబ్బ తీశారు. భారత జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. జమ్మూకశ్మీర్‌లోని మాచిల్ సెక్టార్‌లో ఈ ఘటన చోటు చేసుకంది.
శనివారం అర్ధరాత్రి నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని
ఆర్మీ అధికారులు తెలిపారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ప్రాంతంలో కుప్వారా జిల్లాలో నియంత్రణ
రేఖ వద్ద ఉగ్రవాదులు అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించారని వెల్లడించారు. అమరులైన వారిలో ఓ
ఆర్మీ అధికారి సహా ముగ్గురు జవాన్లు ఉన్నట్లు
ఆర్మీ ప్రతినిధి కల్నల్ రాజేశ్ కాలియా తెలిపారు. ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఆయన వెల్లడించారు.