బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా  పార్టీ విజయం సాధించే అవకాశాలు ఉన్న నేపధ్యంలో ఇప్పుడు మరోసారి విపక్షాలు ఈవీఎం లను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నాయి. రాజకీయంగా ఆర్జెడి కి అన్ని అవకాశాలు కనపడినా సరే బీహార్ ఎన్నికల్లో మాత్రం బిజెపి విజయం సాధించే అవకాశాలు కనపడటంతో కాంగ్రెస్ నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.

కాంగ్రెస్ నేత డాక్టర్ ఉదిత్ రాజ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 'మార్స్ మరియు చంద్రుల వైపు వెళ్లే పరికరాల దిశను భూమి నుండి నియంత్రించగలిగినప్పుడు ఈవీఎంలను ఎందుకు హ్యాక్ చేయలేము?' అని కాంగ్రెస్ నాయకుడు ఉదిత్ రాజ్ తన సోషల్ మీడియాలో ప్రశ్నించారు. వాస్తవానికి ఉదయం ఉన్న ఫలితాల ఆధారంగా చూస్తే  యుపిఏ విజయం సాధించే అవకాశం ఉంది అని అందరూ భావించారు. కాని ఇప్పుడు ఎన్డియేకి అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: