ఏపీలో ఇప్పుడు కొన్ని కొన్ని కేసుల విషయంలో హైకోర్ట్ స్పందిస్తున్న తీరు కాస్త సంచలనం అయింది. కొన్ని కేసుల విషయంలో హైకోర్ట్ దూకుడుగా ఉంది. తాజాగా గుంటూరు నగరంలోని పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పై దాడి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రతివాదిగా ఎన్.ఐ.ఎ ని చేర్చేందుకు హై కోర్టు అనుమతి ఇచ్చింది. పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పై దాడి కేసును ఉపసంహరించుకున్న ప్రభుత్వం... కేసులు కూడా ఎత్తేసింది.

ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హై కోర్టులో పిటీషన్ దాఖలు అయింది. దీనిపై ఇప్పటికే విచారించిన కోర్టు నేడు ఈ ఆదేశాలు ఇచ్చింది. ఎన్.ఐ.ఎ ని ప్రతివాదిగా చేర్చాలని మధ్యంతర పిటీషన్ దాఖలు చేసారు పిటీషనర్. ఎన్.ఐ.ఎ ని ప్రతివాదిగా చేర్చేందుకు అనుమతిస్తూ కేసు విచారణ ఈ నెల 26కు వాయిదా వేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: