వడ్డీ వ్యాపారాలు చేసే వారు వేధించే విధానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా గుంటూరు జిల్లాలో ఒక ఘటన వెలుగులోకి వచ్చింది.
పిడుగురాళ్ల లో వడ్డీ వ్యాపారి పరమేశ్వరావు అరాచకం వెలుగులోకి వచ్చింది. 2 లక్షల నగదు కోసం ఓ కుటుంబాన్ని కిడ్నాప్ చేసారు. 83 ఏళ్ళ తండ్రీని, 65 ఏళ్ళ తల్లి ని , ఇద్దరు పిల్లల్ని నిర్బందం చేసారు.
ఓ గదిలో నెల రోజుల పాటు చిత్రహింసలు పెట్టారు. 65 ఏళ్ళ తల్లికి గజ్జలు, రొమ్ముల పై వాతలు పెట్టారు. బలవంతంగా ఖాళీ నోట్లు పై సంతకాలు చేయించుకున్న పరమేశ్వరరావు... ఇల్లు , బంగారం స్వాధీనం చేసుకున్నాడు. బయటకు చెబితే చంపుతామని బెదిరింపులకు దిగాడు. ఆ తర్వాత బయటకు వచ్చిన కుటుంబం... ఎస్పీకి ఫిర్యాదు చేసారు. ఈ ఘటన సంచలనం అయింది.