గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు  పెద్ద ఎత్తున పోలింగ్ జరుగుతుంది అని అంచనా వేసినా సరే ఆశించిన స్థాయిలో పోలింగ్ జరగడం లేదు. మొదటి రెండు గంటలు కూడా పెద్దగా ఓటింగ్ జరగలేదు. ఇక ఇదిలా ఉంటే గ్రేటర్ ఎన్నికలలో ఎప్పుడు కూడా 46 శాతం పోలింగ్ దాటలేదు. గ్రేటర్  ఎన్నికలపై ఇప్పటి వరకు భారీగా బెట్టింగ్ జరుగుతుంది. బిజెపి, తెరాస మధ్యనే పోటీ ప్రధానంగా ఉండటంతో ఆ రెండు పార్టీల మధ్యనే ఇప్పుడు ఎక్కువగా బెట్టింగ్ జరుగుతుంది.

గ్రేటర్ ఎన్నికల్లో యువత ఓట్లు కీలకం కాగా వాళ్ళే ఓటు వేయడానికి ముందుకు రావడం లేదు. ఓటింగ్ పెరిగితే మాత్రం బిజెపికి కలిసి వచ్చే అంశం ఉంది. పాతబస్తీ ప్రాంతాల్లో ఓటింగ్ చాలా తక్కువగా నమోదు అవుతుంది. తెరాస పార్టీ నేతలు కూడా పోలింగ్ పై ఆశలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: