పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన
టీడీపీ సీనియర్ నేత మృతి చెందారు.
చింతలపూడి నియోజకవర్గ
తెలుగుదేశం పార్టీ కన్వీనర్,
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర
ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు
డాక్టర్ కర్రా రాజారావు ఈరోజు ఉదయం
హైదరాబాద్ ప్రయివేట్ హాస్పిటల్ లో వైద్యం తీసుకుంటు మృతి చెందారు. చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడిగా పని చేసిన ఆయన 2009లో తొలిసారి చింతలపూడి
టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లి తిరిగి వచ్చిన ఆయనకు 2014లో
టీడీపీ టిక్కెట్ ఇవ్వలేదు. ఇక గత ఎన్నికల్లో మళ్లీ
టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఆయన అంత్యక్రియలు ఆయన స్వగ్రామం చింతలపూడిలో రేపు జరగనున్నాయి. ఆయన మృతి పట్ల
పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్‌తో పాటు ఏలూరు పార్లమెంటరీ
పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు తదితరులు సంతాపం తెలిపారు.