విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ నిర‌సిస్తూ విశాఖలోని కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో  రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. 43వ రోజుకు దీక్షలు చేరుకున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ రోజు జ‌రుగుతోన్న భారత్ బంద్‌కు పోరాట కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.  స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేయాలని రోడ్డు మీదకు వచ్చి ప్లకార్డులతో ప్రదర్శనలు చేస్తూ నినాదాలు చేశారు. విశాఖ ఉక్కు..ఆంధ్రుల హక్కు, మోదీ డౌన్.. డౌన్ అంటూ పోరాట కమిటీ సభ్యులు నినాదాలు చేశారు. ఈ నినాదాలు స్థానికంగా హోరెత్తాయి. ప్ర‌జ‌లు సైతం స్వ‌చ్ఛందంగా రోడ్ల మీద‌కు వ‌చ్చి కేంద్ర ప్ర‌భుత్వంపై తీవ్రంగా విరుచుకు ప‌డ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: