మ‌హ‌మ్మారి క‌రోనా బ్రెజిల్‌ను ఊపిరాడ‌నీయ‌కుండా చేస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో ల‌క్ష‌కు పైగా కేసులు న‌మోద‌వ‌డంతో ప్ర‌పంచం ఒక్కసారిగా ఉలిక్కిప‌డింది. రెండు రోజుల్లో ఆరువేల మందికిపైగా మృత్యువాత ప‌డ్డారు. 75 రోజుల్లోనే ల‌క్ష‌మందికిపైగా క‌రోనా పాజిటివ్‌తో మృతిచెందిన‌ట్లు ఆ దేశ వైద్య‌, ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. ఇది మా దేశ చ‌రిత్ర‌లో ఇదివ‌ర‌కు ఎన్న‌డూలేని అతి పెద్ద మార‌ణ‌హోం అని అక్క‌డి మీడియా వ్యాఖ్యానించింది. ప్ర‌జ‌ల‌కు అబ‌ద్దాలు చెప్పి త‌ప్పుదోవ ప‌ట్టించిన అధ్య‌క్షుడు బొల్సెనారోదే ఈ పాపం అని తేల్చేసింది. కొవిడ్-19 నుంచి బ్రెజిల్ ను కాపాడాలంటే ఆ వ్య‌క్తి చేతిలోనే అధికారం ఉంటే సాధ్యం కాద‌ని దేశ మాజీ అధ్య‌క్షుడు లులాడిసిల్వా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌కీయ పార్టీల మ‌ధ్య స‌మ‌న్వ‌యం లేక‌పోవ‌డంవ‌ల్లే దేశంలో క‌రోనా ఉధృత‌రూపం దాల్చ‌డానికి కార‌ణ‌మ‌వుతోంద‌ని వైద్య‌నిపుణులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: