తెలంగాణలో క‌రోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క‌ఠిన చ‌ర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వం తాజా ఉత్త‌ర్వులు జారీ చేయ‌డంతో పాటు కఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేయ‌నుంది. హైద‌రాబాద్‌లో మాస్క్ లేకుండా బ‌య‌ట‌కు వ‌స్తే వారి వాహ‌నాలు ఫొటోలు తీసి మ‌రి జ‌రిమానా విధించాల‌ని నిర్ణ‌యించింది. మూడు పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలోని ప్రధాన ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు మాస్క్‌ లేకుండా వెళ్తున్నవారి ఫోటోలు తీసి వాహనం నంబరు ఆధారంగా ఇంటికి ఈ-చలానాలను పంపనున్నారు. అయితే జ‌రిమానా ఎంత అన్న‌ది మాత్రం ఇంకా నిర్ణ‌యించ‌లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: