వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం వివాదం పై కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ధాఖలు చేసింది. ఆయ‌న పౌర‌స‌త్వ వివాదంపై దాదాపుగా ప‌దేళ్లుగా పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. ఈ వివాదం న‌డుస్తుండ‌గానే ఆయ‌న ఏకంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో టీడీపీ నుంచి గెలిచిన ర‌మేష్‌, ఆ త‌ర్వాత 2011 ఉప ఎన్నిక‌లు, 2014, 2018 సాధార‌ణ ఎన్నిక‌ల్లోనూ వ‌రుస విజ‌యాల‌తో నాలుగుసార్లు గెలిచారు. పౌర‌స‌త్వ వివాదంతో ఆయ‌న దేశంలోనే ఈ ఒక్క విష‌యంలో కాంట్ర‌వ‌ర్సీ ఎమ్మెల్యేగా మారిపోయారు.

దేశంలో ఏ ఎమ్మెల్యే పౌర‌స‌త్వం విష‌యంలోనూ ఇంత పెద్ద కాంట్ర‌వ‌ర్సీ రాలేదు. 10 ఏళ్లకు ఒకేసారి జర్మనీ పాస్ పోర్ట్ ను ఇస్తారు. 2013 వరకు జర్మనీ పాస్ పోర్ట్ కలిగి ఉన్నట్లు ఇండియన్ సిటిజన్ షిప్ తీసుకునే ముందు చెన్నమనేని రమేష్ పేర్కొన్నారు. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: