బంగారం రేటు ప‌రుగులు పెడుతోంది. కొద్ది రోజులుగా స్థిరంగా ఉంటోన్న బంగారం తాజాగా దూసుకు వెళ్లింది. బంగారం ధర పెరిగితే వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. వెండి రేటు భారీగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరగడం వల్ల దేశీ మార్కెట్‌లోనూ అదే ట్రెండ్ కొనసాగిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. హైద‌రాబాద్‌లో శుక్ర‌వారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.600 పైకి చేరింది. దీంతో రేటు రూ.45,440కు ఎగసింది.

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.550 పెరుగుదలతో రూ.41,650కు చేరింది. వెండి ధర ఏకంగా రూ.1400 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.68,700కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: