ఏపీలో క‌రోనా కంట్రోల్ అయ్యేలా లేదు. భారీగా కొత్త కేసులు న‌మోద‌వుతూనే ఉండ‌గా… మ‌ర‌ణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక స‌గ‌టున రోజుకు 1000 కొత్త కేసులు న‌మోదు అవుతున్నాయి. గ‌త రెండు రోజులుగా న‌మోదు అవుతోన్న కేసులు చూస్తే 1300కు కాస్త అటూ ఇటూగా ఉంటున్నాయి. నిన్న ఐదుగురు మ‌ర‌ణించారు. కొత్త‌గా 610మంది కోలుకున్నారు.రాష్ట్రంలో గుంటూరు, చిత్తూరు, విశాఖ‌, కృష్ణా జిల్లాల్లో భారీగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఈ మూడు జిల్లాల్లో భారీగా కేసులు న‌మోదు అవుతుండ‌డంతో ప‌లువురు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య‌- 9,04,548గా ఉండ‌గా... యాక్టివ్ కేసులు 8815 ఉన్నాయి. ఇక వీరిలో డిశ్చార్జ్ కేసులు  8,88,508, మ‌ర‌ణాలు 7225గా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: