ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంతలా విజృంభిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే కేసుల తీవ్రత పెరిగిపోతోన్న నేపథ్యంలో పలు దేశాలు, పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ పెట్టక తప్పడం లేదు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 7 రోజుల పాటు లాక్‌డౌన్ విధించనున్నట్లు బంగ్లాదేశ్ వెల్లడించింది. వైరస్‌ను కట్టడి చేసేందుకు సోమవారం నుంచి ఏడు రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించారు.
అయితే ఈ లాక్ డౌన్ నుంచి అత్యవసర సర్వీసులు, పరిశ్రమలను లాక్‌డౌన్ నుంచి మినహాయిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ పని చేసుకోవచ్చు. బంగ్లాదేశ్‌లో శుక్రవారం ఏకంగా 6,830 కొత్త కరోనా కేసులు బయట పడ్డాయి. దీంతో పాటు 50 మరణాలు సంభవించడంతో ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. ఇక మరో దేశం అయిన ఇటలీ మూడు రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించింది.
మరింత సమాచారం తెలుసుకోండి: