తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు ఏకంగా 1,097 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇటీవ‌ల కాలంలో అధికారిక లెక్క‌ల ప్ర‌కార‌మే రోజుకు వెయ్యికి పైగా కేసులు న‌మోదు అవుతున్నాయి. అయితే వాస్త‌వంగా ఈ సంఖ్య ఇంకా చాలా ఎక్కువే ఉంటుందంటున్నారు. ఇక నిన్న కరోనా కారణంగా ఆరుగురు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,13,237 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,723 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 8,746 యాక్టివ్ కేసులున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: