దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఇక తెలంగాణలో అయితే ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. ఇవి ఎంతగా అంటే దేశంలోనే మూడో స్థానంలో 101 ఫారన్‌హీట్‌లతో ఉంది. మొదటి స్థానంలో
ఉత్తరప్రదేశ్, చత్తీస్ ఘడ్ నిలిచాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైనే కొనసాగుతుండగా.. మంగళవారం అత్యధికంగా ఆదిలాబాద్
జిల్లా తాంసిలో 41.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయింది. అతి తక్కువగా సంగారెడ్డి
జిల్లా అల్లోలెలో 20.6 డిగ్రీలు నమోదైంది. హైదరాబాద్‌లో పగటి ఉష్ణోగ్రత 39.7 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 25.8 డిగ్రీలుగా రికార్డయింది.