ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికల విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం అధికారులు సిద్దం అవుతున్నారు. రేపు షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపధ్యంలో పోలింగ్‌ సామాగ్రి పంపిణీ కేంద్రాలకు పోలింగ్‌ సిబ్బంది వస్తున్నారు. డిస్ర్టిబ్యూషన్‌ సెంటర్లలో రిపోర్టు చేయాలని జిల్లా అధికారుల మౌఖిక ఆదేశాలు ఇచ్చారు.

వివిధ జిల్లాల్లో డిస్ర్టిబ్యూషన్‌ సెంటర్లకు వస్తున్న సిబ్బందిలో అయోమయం నెలకొంది. డ్యూటీలో రిపోర్టు చేయమన్నారని చెబుతున్న సిబ్బంది... ఎన్నికలకు సిద్దంగా ఉన్నామని అంటున్నారు. పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ తదనంతర ప్రక్రియ పై సింగిల్‌ జడ్జి స్టే ఇచ్చారు. సింగిల్‌ జడ్జి తీర్పును డివిజనల్‌ బెంచ్‌లో సవాల్‌ చేసిన ఎస్‌ఈసీ పిటీషన్ పై నేడు విచారణ జరుగుతుంది. ఎస్‌ఈసీ 1వతేదీన ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం రేపు పోలింగ్‌ జరగాల్సి ఉంది. డిస్ర్టిబ్యూషన్‌ సెంటర్లకు సిబ్బంది వస్తుండటంతో ఉన్నతాధికారులు అయోమయంలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: