విద్యార్థుల‌కు ప్ర‌భుత్వం పిడుగు లాంటి వార్త చెప్పింది. కరోనా కారణంగా ఉన్నత విద్యావిభాగంలో ప్రస్తుతం అమలవుతున్న పరీక్షలు, విద్యా విధానాలు కొనసాగుతాయని, వేసవి సెలవులు ఈ ఏడాది ఉండవని ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ అశ్వత్థనారాయణ స్పష్టం చేశారు. పరీక్షలు ముగిశాక వేసవి సెలవులు ఉండవని, ఆ వెంటనే తరగతులు ప్రారంభం కానున్నాయన్నారు. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ క్లాసులు కొనసాగుతాయన్నారు. అయితే విద్యార్థుల‌కు ఈ రెండు ఆప్ష‌న్ల‌లో త‌మ‌కు న‌చ్చిన ఆప్ష‌న్ ఎంచుకునే వెసులు బాటు ఇచ్చారు. ఏదేమైనా ఈ యేడాది స‌మ్మ‌ర్ మండిపోతున్నా వేస‌వి సెల‌వులు లేక‌పోవ‌డం ఇబ్బందే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: