దేశంలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. ఒకే రోజులో లక్షన్నరకిపైగా కేసులు నమోదు కావడంతో ఆందోళన పెరిగిపోతోంది. గత వారం రోజులుగా రోజుకు సరాసరీ లక్షకు పైగా కేసులు నమోదు అవుతోన్న పరిస్థితి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య తొలిసారిగా 11 లక్షలు దాటేసింది. ఇప్పటివరకు ఫస్ట్ వేవ్ లో కూడా ఈ స్థాయిలో యాక్టివ్ కేసులు నమోదు కాలేదు. దీనిని బట్టి భారత్ కరోనా కేసుల్లో మరో రికార్డు బద్దలు కొట్టింది. ఈ సంఖ్య ఇంకా పెరిగిపోతుండడంతో హాస్పటల్స్‌లో చికిత్స చేయడం కష్టమవుతుందని... బెడ్స్ కూడా సరిపోవని వైద్య నిపుణులు ఆందోళన చేస్తున్నారు.
దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,33,58,805కి చేరుకుంది. ఒకే రోజులో 839 మంది కరోనాకు బలి కావడంతో మొత్తం మరణాల సంఖ్య 1,69,275కి చేరుకుంది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య కనీవినీ ఎరుగని రీతిలో పెరిగిపోయాయి. ప్రస్తుతం 11,09,087 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా మొదటి వేవ్ సమయంలో సెప్టెంబర్ 17నాటి 10,17,754 యాక్టివ్ కేసులే ఇప్పటివరకు అత్యధికం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి