మ‌న‌దేశంలో క‌రోనా శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజుకు స‌గ‌టున కేసులు 3 ల‌క్ష‌ల‌కు చేరువ అవుతున్నాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా తీవ్ర భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే భార‌త్‌తో విమానాల రాక‌పోక‌ల‌పై ప‌లు దేశాలు ఆంక్ష‌లు విధిస్తున్నాయి. ఇప్ప‌టికే హాంకాంగ్ ఆంక్ష‌లు విధించ‌గా.. ఇప్పుడు యూకే సైతం భార‌త ప్ర‌యాణికుల‌పై ఆంక్ష‌లు విధించింది. భార‌త్‌ను రెడ్ లిస్టులో చేర్చింది.

భార‌త్ నుంచి యూకే వ‌చ్చే ప్ర‌యాణికులు త‌ప్ప‌నిరిగా 10 రోజులు క్వారంటైన్లో ఉండాల‌ని చెప్పింది. తాజాగా యూకేకు వ‌చ్చిన 103 మంది భార‌త్‌లో శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతోన్న క‌రోనా వైర‌స్‌ను అక్క‌డ వ్యాప్తి చేయిస్తున్నార‌న్న సందేహాల‌తో బ్రిట‌న్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణ‌యం క‌ఠిన‌మైందే అని కోవిడ్ వ్యాప్తి క‌ట్ట‌డిలో ఈ నిర్ణ‌యం తీసుకోక త‌ప్ప‌డం లేద‌ని బ్రిట‌న్ ప్ర‌భుత్వం పేర్కొంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: