ఏపీ, తెలంగాణ‌లో ప‌లువురు రాజ‌కీయ నేత‌ల‌ను క‌రోనా వ‌ద‌ల‌డం లేదు. క‌రోనా దెబ్బ‌తో కొంద‌రు ఇప్ప‌టికే ప్రాణాలు విడిచారు. ప్ర‌జా ప్ర‌తినిధులు ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా క‌రోనా మాత్రం వీరిని వెంటాడుతూనే ఉంది. తాజాగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. బెందాళం అశోక్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం బెందాళం అశోక్ హోం ఐసొలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. గత వారం రోజుల నుంచి తనను కలసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: