కరోనా పాజిటివ్‌తో హోం ఐసోలేషన్‌లోనే చికిత్స తీసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు రాత్రి యశోదా ఆసుపత్రికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 19న కేసీఆర్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్దార‌ణ అయ్యింది. ఆ త‌ర్వాత 21న ఆయ‌న య‌శోదా హాస్ప‌ట‌ల్లో సిటీ స్కాన్‌తో పాటు అనేక ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. ప్ర‌స్తుతం కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నా.. ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉన్నా కూడా ఆయ‌న మ‌రోసారి యశోదాకు వ‌చ్చి అక్క‌డ వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోనున్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న‌కు కోవిడ్ నెగిటివ్ వ‌స్తుందా ?  లేదా ? అన్న టెన్ష‌న్ ఇప్పుడు అంద‌రిలోనూ ఉంది. కేసీఆర్ చేయాల్సిన స‌మీక్ష‌లు చాలా వ‌ర‌కు పెండింగ్‌లో ఉండ‌డంతో ఇటు అధికారులు కూడా ఆయ‌న కోసం వెయిట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: