కరోనా మహమ్మారి గణాంకాల్లో అగ్రదేశాలను భారత్‌  వెనక్కి నెట్టేస్తోంది. క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతి భార‌త్‌లో మామూలుగా లేదు. భార‌త్‌లో క‌రోనా రోజు రోజుకు స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే దేశంలో రోజు రోజుకీ వైరస్‌ సంక్రమిస్తున్నవారి సంఖ్య, మరణాల సంఖ్యలో గణనీయ పెరుగుదలతో భారత్‌లో పరిస్థితి భయంకరంగా మారింది. 

కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన కరోనా గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 3,79,257 కొత్త పాజిటివ్‌ కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం సోకిన వారి సంఖ్య 1,83,76,524కు చేరింది. కరోనా ఎక్కువగా ప్రభావితమైన పది రాష్ట్రాల్లోనే 72.20% పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్‌తో పోరాడి 3,645 మంది తుది శ్వాస విడిచారు. దీంతో మరణాల సంఖ్య 2,04,832కు పెరిగింది. కొత్తగా 2,69,507 మంది కోలుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: