తెలంగాణ ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన శాఖపై కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖను ముఖ్యమంత్రి తనకు అటాచ్ చేసుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు వైద్యఆరోగ్యశాఖ కేటాయిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వైద్య , ఆరోగ్యశాఖను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు బదిలీ చేస్తూ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచన మేరకు గవర్నర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈటల రాజేందర్‌ శాఖలేని మంత్రిగా మారారు. ఇక దీని పై ఈటల స్పందించారు. ఇది జరిగిన వెంటనే ఈటల మీడియా ముందుకు వచ్చారు. తన శాఖ నుంచి తనను సీఎం తొలగించారని తెలిసిందని... చాలా సంతోషం అని చెప్పారు. ఒక పక్కా ప్రణాళికతో ఇదంతా జరుగుతోందని ఈటల వ్యాఖ్యానించారు. అందరు నేతలు ఎన్నికలలో నిమగ్నమైతే... తాను పూర్తిగా కరోనా నియంత్రణపైనే దృష్టి సారించారని ఈటల తెలిపారు. అందుకే ఏం జరుగుతోందో తనకు తెలియలేదని అన్నారు. 25 ఏళ్ల జీవితంలో తనకు ఇలాంటి అనుభవం ఎదురుకాలేదని చెప్పారు. మనసులో ఏదో పెట్టుకుని, కుట్ర పూరిత కథనాలతో, ఎదుటి వారి క్యారెక్టర్ ను నాశనం చేయాలనుకోవడం దారుణమని అన్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: