తెలంగాణ వ్యాప్తంగా ఇంట‌ర్ ద్వితీయ సంవ‌త్స‌రానికి ఆన్‌లైన్ క్లాసులు వ‌చ్చే నెల‌లో ప్రారంభంకానున్నాయి.జులై 1 నుంచి ఈ త‌ర‌గ‌తుల‌ను నిర్వ‌హించాల‌ని విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఇంట‌ర్‌బోర్డుకు ఆదేశాలు జారీ చేశారు.జులై 5వ తేదీ వ‌ర‌కు ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ అడ్మిష‌న్లు కొన‌సాగ‌నున్న‌ట్లు ఆమె తెలిపారు.దుర‌ద‌ర్శ‌న్‌,టీశాట్ ద్వారా ఆన్‌లైన్‌లో పాఠాల‌ను ప్ర‌సారం చేస్తామ‌ని తెలిపారు.గ‌తేడాదిలానే సిల‌బ‌స్ నుంచే 70 శాతం పాఠాలు ఉంటాయ‌న్నారు. టీవీలు,స్మార్ట్ ఫోన్లు లేని విద్యార్థులు కాలేజీల‌కు వ‌చ్చి పాఠాలు వినేలా డిజిట‌ల్ లైబ్ర‌రీల‌ను ఏర్పాటు చేయాల‌ని ఇంట‌ర్ బోర్డు నిర్ణ‌యించింది.క‌రోనా కార‌ణంగా ఇంట‌ర్,టెన్త్ ప‌రీక్ష‌లు ర‌ద్దు అయ్యాయి.వ‌చ్చే ఏడాది విద్యాసంవ‌త్స‌రానికి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఆన్‌లైన్ లో త‌ర‌గ‌తులు నిర్వ‌హించాల‌ని విద్యాశాఖ భావించి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: