కేంద్ర కేబినెట్ విస్తరణ జరుగుతుంది అని వార్త బయటకు వచ్చిన తర్వాత ఎవరికి ప్రమోషన్ లభిస్తుంది ఎవరిని కేబినెట్ నుంచి బయటకు పంపిస్తారు అనేదానిపై మీడియా వర్గాల్లో ఆసక్తికరమైన చర్చలు జరిగాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సమర్థులకు కచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రాధాన్యత కల్పిస్తారని అందరూ భావించారు. ఈ నేపథ్యంలోనే విద్యావంతులతో పాటు సామాజిక వర్గాల లెక్కలు కూడా పరిగణలోకి తీసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. 


ఈ నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్ లో ఏడుగురికి ప్రమోషన్ లభించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కి ప్రమోషన్ లభించింది అదే విధంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా ఉన్న అనురాగ్ ఠాకూర్ కి కూడా ప్రమోషన్ లభించడం గమనార్హం. అదే విధంగా మరో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల, కిరణ్ రిజిజు.. హర్దీప్ సింగ్ పూరీ, మానుష్ మాందన్యకు కేంద్ర కేబినెట్ లో ప్రమోషన్ లభించింది. ఇక ఆశావాహుల విషయంలో కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడీ చాలావరకు జాగ్రత్తలు తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: