జమ్మూకాశ్మీర్ లోని కుల్గాం ఏరియాలో ఈ రోజు ఉదయం నుంచి ఎన్కౌంటర్ జరుగుతోంది. ఎన్కౌంటర్ లో ఒక టెర్రరిస్ట్ చనిపోగా, ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ లు, మరో ఇద్దరు సివిలియన్లు గాయాలతో బయటపడ్డారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాశ్మీర్ లో ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతోంది. అయితే ఎన్ కౌంటర్ జరుగుతున్న ప్రాంతంలో భారీ బ్లాస్ట్ జరిగినట్టు తెలుస్తోంది. ఓ మీడియా కథనం ప్రకారం ఆ బ్లాస్ట్ కు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. అందులో పెద్ద సౌండ్ తో బ్లాస్ట్ జరగగా, భారీ ఎత్తున మంటలు చెలరేగాయి.

మరో రెండు రోజుల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఉండగా ఈ సమయంలో ఉగ్రవాదుల ఎన్కౌంటర్ జరగడం ఆందోళనకరంగా మారింది. ఆగస్టు 15న పలుచోట్ల టెర్రరిస్ట్ అటాక్ జరిగే అవకాశం ఉందని తెలియడంతో అధికారులు ముందుగానే అప్రమత్తమయ్యారు. చాలాచోట్ల లో భద్రతా బలగాలు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎలాంటి అపశకునం జరగకుండా ఉండడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: