ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. తూర్పుగోదావరి జిల్లా గన్నవరం పి లో నిర్మించిన పాఠశాలను సీఎం ప్రారంభించనున్నారు. అదేవిధంగా జగనన్న విద్యా కానుకను కూడా సీఎం ఇక్కడనుండే ప్రారంభిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ మరియు ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుకుంటున్న 47 లక్షల 32 వేల మంది విద్యార్థులకు విద్యా కానుకను సీఎం అందజేస్తారు.

అంతే కాకుండా జగనన్న విద్యా కానుక కిట్లను అందజేస్తారు. ఈ కిట్ లో వర్క్ బుక్ లు, నోట్ బుక్ లు,ఒక జత షూస్, మూడు జతల యూనిఫాం క్లాత్ లు, బెల్టులు ఉండనున్నాయి. అంతేకాకుండా ఈ ఏడాది అదనంగా ఆక్స్ ఫర్డ్ డిక్షనరీని కూడా అదనంగా అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం తాడేపల్లి లోని ఇంటి నుండి ఉదయం 10గంటలకు బయలు దేరారు. 11 గంటలకు పోతవరం గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడనుండి   పి గన్నవరం హై స్కూల్ కు చేరుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: