తమిళ పరిశ్రమ లో విశాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి నల్లైనై చిత్ర (56) శనివారం తమ నివాసంలో కన్ను మూసింది. గుండెపోటు రావడంతో నటి మృతి చెందినట్టు కుంటుబ సభ్యులు వెల్లడించారు. శనివారం సాయంత్రం ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు కుంటుబ సభ్యులు చెప్పారు. ఇదిలా ఉండగా చిత్ర బాల నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు .
1980-90 కాలంలో తమిళంతో పాటు కన్నడ , తెలుగు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పరంపర , కలిక్కలం , రాజవచ్చ లాంటి సినిమాలలో నటించిన చిత్రకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చింది. సినిమాలలోనే కాకుండా తమిళ సీరియల్స్ లోనూ నటించిన చిత్రం ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక నటి చిత్రకు భర్త, కూతురు ఉన్నట్టు తెలుస్తోంది. నటి మృతి పై తమిళ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులు సంతాపం ప్రకటించారు.
మరింత సమాచారం తెలుసుకోండి: