పారాలింపిక్స్ లో భార‌త క్రీడాకారులు స‌త్తా చాటుతున్నారు. తాజాగా జావెలిన్ త్రో ఎఫ్ 64 విభాగంలో క్రీడాకారుడు సుమిత్ అంటిల్ ప‌సిడి ప‌త‌కాన్ని సాధించాడు. సుమిత్ 68.55 మీట‌ర్లు విసిరి ప‌సిడి ప‌త‌కాన్ని సొంతం చేసుకున్నాడు. అంతే కాకుండా సుమిత్ 68.55 మీటర్లు విసిరి ప్ర‌పంచ రికార్డును సైతం నెల‌కొల్పాడు. ఇక ఈ స్వ‌ర్ణ ప‌త‌కంతో టోక్యో పారాలింపిక్స్ లో దేశానికి రెండ‌వ స్వ‌ర్ణ ప‌త‌కం వ‌చ్చింది. 

ఇక ఇప్ప‌టికే ఇండియా త‌ర‌పున ప‌ది మీట‌ర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో మ‌హిళా షూట‌ర్ అవ‌ని లేఖ‌రా స్వ‌ర్ణం సాధించింది. ఇక ఒకే రోజు భార‌త్ కు మ‌రో ప‌త‌కం రావ‌డంతో భార‌త ప్ర‌జ‌లు క్రీడా కారులు ఎంతో సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ప‌త‌కాలు సాధించిన క్రీడాకారుల‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే జావెలిన్ త్రో ఎఫ్ 64 విభాగంలో ప‌త‌కం సాధించిన సుమిత్ కు ప్ర‌ధాని అభినంద‌లు తెలిపారు. సుమిత్ రికార్డు విజ‌యంతో దేశం గ‌ర్వ‌ప‌డుతోంద‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: