కడప జిల్లాలో దొంగతనానికి గురైన పెద్ద ఎత్తున పల్సర్ బైకులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు, కడప జిల్లాలో పాటు చిత్తూరు జిల్లాలో బైకుల దొంగతనానికి పాల్పడిన ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను కూడా వారు అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ నిందితులు కడప జిల్లా రాయచోటి కి చెందిన ఏసురత్నం, అనంతపురం జిల్లా కదిరి కి చెందిన మురళి గా గుర్తించిన పోలీసులు, వారి వద్ద నుండి 34 పల్సర్ బైకులు స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరి వద్ద అన్నీ పల్సర్ బైకులు స్వాధీనం కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అసలు వీళ్ళు వేరే బైకుల మీద దృష్టి పెట్టలేదా ? లేక పల్సర్ బైక్ లనే ఎందుకు ఎంచుకున్నారు ? అనే విషయం మీద కూడా పోలీసులు దృష్టి పెట్టారు.. మొత్తం మీద ఇలాంటి వింత దొంగలు కూడా ఉంటారనే విషయం ఇప్పుడు ఈ ముఠాను చూస్తుంటే అర్ధం అవుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి