బిగ్‌ బాస్‌ ఐదవ సీజన్‌ లో తొలి రోజే  తొలివారం నామినేషన్‌ ప్రక్రియ మొదలైంది, ఈ ప్రక్రియలో అందులో భాగంగా కంటెస్టెంట్లు నామినేట్‌ చేయాలనుకున్న వారి ఫొటోలు ఉన్న చెత్త కవర్లను చెత్త కుండీలో వేయాలి అంటూ కండిషన్ పెట్టారు. అలా మొదలైన ఈ  నామినేషన్‌ ప్రక్రియ సభ్యుల మధ్య చిచ్చి రేగే విధంగా సాగింది, అలా మొదటి వారం నామినేషన్‌ ప్రక్రియ పూర్తైంది, అయితే ఎక్కువగా ఓట్లు పడిన రవి, మానస్‌, సరయూ, కాజల్‌, హమీదా, జెస్సీలు ఈవారం ఎలిమినేషన్‌ ప్రక్రియ కోసం నామినేట్‌ అయినట్లు బిగ్‌బాస్‌ వెల్లడించాడు. ఈ క్రమంలో ఈ మొదటి వారం నుంచే నామినేషన్లో ఉన్న  వారందరూ ఇప్పుడు ఓట్లు వేయించుకోవడం మీద ద్రుష్టి పెట్టారు అని చెప్పక తప్పదు, ఇప్పటికే వారంతా హౌస్ లోపలి వెళ్లే ముందే అంతా సెట్ చేసుకుని రావడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్స్  అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: