సింగ‌రేణి కాల‌నీలో చిన్నారిపై హ‌త్యాచారం చేసిన నింధితుడు రాజు ఈ రోజు ఉద‌యం ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా రాజు మృతి పై అత‌డి కుటుంబ సభ్యులు స్పందించారు. త‌న  కొడుకు ఆత్మ‌హ‌త్య కాద‌ని పోలీసులే చంపారని రాజు త‌ల్లి ఆరోపిస్తుంది. పోలీసులు త‌మ‌ను వదిలిపెట్టినప్పుడే రాజు పోలీసులకు దొరికాడని అర్ధమయ్యిందని రాజు తల్లి వీరమ్మ వ్యాఖ్యానించింది. 

ఇక త‌న‌ భర్త త‌న‌కు కావాలని....లేకుంటే తాను కూడా చచ్చిపోతాన‌ని రాజు భార్య మౌనిక ఆవేద‌న వ్య‌క్తం చేస్తుంది. ఇదిలా ఉండ‌గా రాజు సొంత జిల్లా న‌ల్గొండ కాగా అత‌డు పుట్ట‌క ముందే రాజు త‌ల్లి దండ్రులు  హైద‌రాబాద్ కు వ‌ల‌స వ‌చ్చారు. ఆ త‌ర‌వాత రాజు హైద‌రాబాద్ లోనే జన్మించాడు. సింగ‌రేణి కాల‌నీలో నివాసం ఉంటున్న అత‌డికి పెళ్లి కాగా భార్య మౌనిక మ‌రియు కూతురు కూడా ఉన్నారు. ఇక రాజు ఒక అక్క ఉండ‌గా ఆమెకు వివాహం జ‌రింగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: