అయితే తాజా పరిస్థితుల్లో మాత్రం మెగా ఫ్యామిలీ అభిమానులు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉపాసన గురించి సోషల్ మీడియాలో వచ్చిన నెగిటివ్ కామెంట్స్ అందరినీ కలచివేశాయి.ఉపాసన రెండవసారి ప్రెగ్నెన్సీని ఆనందంగా ప్రకటించినప్పుడు, దేశం మొత్తం నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కానీ అదే సమయంలో కొందరు మాత్రం అసత్య వార్తలు సృష్టిస్తూ ఆమెపై అనవసర ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు."అపోలో ఆమె చేతుల్లో ఉంది కావడం వల్లే ప్రత్యేక ట్రీట్మెంట్ పొందుతోంది","ఈసారి కూడా సహజంగా గర్భం రాలేదు","పుట్టబోయే బిడ్డ కోసం ముందే ప్రత్యేక మెడికల్ ప్లానింగ్స్ చేశారు"అంటూ వివిధ రకాల విచిత్రమైన రూమర్లు రచ్చపెట్టారు.ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో ప్రజలు బాధ్యతగా మాట్లాడాలి. ముఖ్యంగా ఒక మహిళ ప్రెగ్నెన్సీ గురించి ఇలా రూమర్లు చాలా తప్పు. ఈ విషయమై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ వార్తలపై చిరంజీవి స్పందించకపోయినా పర్వాలేదు… కానీ సొంత ఇంటి కోడలిపై, అది కూడా ప్రెగ్నెన్సీ వంటి ప్రైవేట్ విషయంపై ఇలాంటి నెగిటివ్ ప్రొపగాండా నడుస్తున్నప్పుడు, చిరంజీవి ఏదో ఒకసారి స్పందించాలి అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
చిరంజీవి మంచితనాన్ని చూసుకుని, ఆయన మౌనాన్ని దుర్వినియోగం చేసుకుని కొందరు రెచ్చిపోతున్నారనే భావన అభిమానుల్లో బలమవుతోంది."మెగా ఫ్యామిలీ పరువు తీసేందుకే కొన్ని పేజీలు, యూట్యూబ్ ఛానెల్స్ ఉద్దేశపూర్వకంగా నెగిటివ్ కంటెంట్ సృష్టిస్తున్నాయి"అంటూ కామెంట్స్ విపరీతంగా వస్తున్నాయి. మెగా అభిమానుల అభిప్రాయం ప్రకారం— ఇలాంటి వ్యక్తిగత విషయాలలో, ముఖ్యంగా కోడలి గౌరవం తగ్గించే పరిస్థితుల్లో, చిరంజీవి ఒక క్లియర్ స్టేట్‌మెంట్ ఇస్తే ఈ రూమర్లకు పూర్తి స్టాప్ పడుతుందని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ చర్చ మరింత వేడి పుట్టిస్తోంది.మొత్తం గా చెప్పాలంటే, ఇటీవలి కాలంలో వస్తున్న నెగిటివ్ వార్తలు నిజంగా బాధ కలిగిస్తున్నాయి. స్టార్ హీరో అయిన చిరంజీవి మౌనం కూడా మహోన్నతమే కానీ, అభిమానులు మాత్రం తమ ఫ్యామిలీ గౌరవం కాపాడేందుకు కొంచెం స్పందన అవసరం అని నమ్ముతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి