సిసి టీవీ ఫుటేజ్ అడగడం ‘మా’ సభ్యుల హక్కని, చాలా విషయాల్లో తను బైలాస్ మారుస్తానని, జనరల్ బాడీ మీటింగ్ లో ప్రపోజల్ పెడతామని మా అధ్య‌క్షుడు విష్ణు చెప్పారు. స‌భ్య‌త్వాన్ని స్ర్టిక్ట్ చేయాలని, ఎవరు పడితే వాళ్ళు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ స‌భ్యులు కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని భాషల వారి అసోసియేషన్స్ బైలాస్ చదవుతానని, వాటిని మాకు అనుగుణంగా మార్పులు చేసి.. పెద్దల సమక్షంలో వారి అనుమతితో బైలాస్ అమ‌లు చేయాడానికి ప్ర‌య‌త్నిస్తాన‌ని మంచు విష్ణు వెల్ల‌డించారు. తిరుమ‌ల‌లో శ్రీ‌వారి ద‌ర్శ‌నం చేసుకున్న త‌ర్వాత మా కార్యాల‌యంలో ప్యానెల్ స‌భ్యులు మాదాల ర‌వి, బాబూమోహ‌న్‌, శివ‌బాలాజీ, క‌రాటే క‌ల్యాణి త‌దిత‌రులు పాల్గొన్నారు. స్వామివారి ద‌ర్శ‌నానికి త‌మ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే చ‌క్క‌గా స‌హ‌క‌రించార‌ని, ఆయ‌న‌కు అందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్న‌ట్లు తెలిపారు. తాను, ప్ర‌కాష్ రాజ్ స‌మ‌క్షంలోనే ఎన్నిక‌ల అధికారి పోస్ట‌ల్ బ్యాలెట్ ఓపెన్ చేయించార‌ని, అందులో ఎటువంటి అవ‌క‌త‌వ‌క‌లు జ‌ర‌గ‌లేద‌ని, రాత్రికి స‌మ‌యం అవ‌డంతో మ‌రుస‌టి రోజు లెక్కించార‌న్నారు. అక్క‌డ ఎలాంటి గొడ‌వ జ‌ర‌గ‌లేద‌ని విష్ణు స్ప‌ష్ట‌తనిచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

maa