ఆస్తుల కోసం కొంతమంది కుటుంబ సభ్యులను హతమారుస్తుంటే మరి కొందరు బతికుండగానే చనిపోయినట్టు డెత్ సరటిఫికెట్ లు క్రియేట్ చేస్తున్నారు. ఆ తరవాత భూమిని తమ పేరు మీదకు మార్చుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే గుంటూరు లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... గుంటూరు నరసరావుపేట మండలం ఇస్సపాలెం లో తప్పుడు పత్రాలతో 9 ఎకరాల భూమిని ఓ వ్యక్తి తన పేర రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు.

బండ్లమూరి వెంకయామ్మ (90) చనిపోయినట్లు ఆమె మనవడు కోటయ్య డెత్ సర్టిఫికేట్ పుట్టించి ఆమె పేరు పై ఉన్న భూమిని తన పేరు మీదకు మార్చుకున్నాడు. మొత్తం 20 కోట్ల విలువైన భూమిని కోటయ్య తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఇక మోసగాడు కోటయ్య కు రెవిన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బంది కూడా సహకరించారు. ఈ విషయం తెలిసి వృద్ధురాలు తాను బతికే ఉన్నా అని నరసరావుపేట ఆర్డిఓ కు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని వృద్దురాలు వెంకయామ్మ అధికారులను వేడుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: