క్రికెట్ లో కేవ‌లం ప్ర‌తిభ ఉంటేనే స‌రిపోదు దానికి కాస్త ల‌క్ కూడ తోడు ఉండాలి. కొంత‌మంది అద్భుతంగా రాణించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటారు. గ‌ల్లీ క్రికెట్‌లో ఆక‌ట్టుకునే వారి గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకుంటుంటాం. త‌రుచూ ఎవ‌రి గురించో ఒక‌రి గురించి చ‌ర్చించుకుంటాం. తాజాగా ఓ వీడియోలో బాలుని ఆట‌ చూసి  క్రికెట్ దిగ్గ‌జ  మాజీ ఆట‌గాడు స‌చిన్ టెండుల్క‌ర్ ఫిదా అయిపోయాడు.

ఒక బాలుడు త‌న స్ఫిన్ వేసి భౌలింగ్ చేశాడు. బ్యాట్స్‌మెన్‌కు చుక్క‌లు చూపించాడు. షాట్లు ఆడేందుకు బ్యాట్స్‌మెన్‌కు ఛాన్సే ఇవ్వ‌లేదు. దాదాపుగా అంద‌రినీ ఔట్ చేసి ఆశ్చ‌ర్య‌పోయేలా చేశాడు బాలుడు. గ‌ల్లీ క్రికెట్ అయినా ఆ బాలుని ప్ర‌తిభ‌ను అంతా మెచ్చుకుంటున్నారు. అత‌ను చేసే బౌలింగ్ యాక్ష‌న్ చాలా బాగున్న‌ది. పిల్ల‌లతో పాటు యువ‌కులు కూడ అత‌ని బౌలింగ్ ముందు త‌డ‌బ‌డుతున్నారు. ఈ వీడియో చూసిన‌ స‌చిన్.. ఆ పిల్లాడి ప్ర‌తిభ బాగుంద‌ని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసాడు. ఇత‌ను చాలా బ్రిలియంట్‌, ఇత‌నికి ఆట‌పై ఉన్న ప్రేమ‌, అభిరుచి ఉన్న‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్న‌ద‌ని క్యాప్ష‌న్ చేర్చాడు. ఇది ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది.

మరింత సమాచారం తెలుసుకోండి: