హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల కౌంటింగ్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఈట‌ల ఆధిక్యాన్ని క‌న‌బ‌రుస్తూ వ‌చ్చారు. ఎనిమిది, ప‌ద‌కొండు రౌండ్‌ల‌లో టీఆర్ఎస్ కాస్త ముందంజ‌లో ఉండింది. ఇక వ‌రుస‌గా మిగ‌తా అన్ని రౌండ్ల‌లో ఈట‌ల త‌న ఆధిక్యాన్ని క‌బ‌రిచి ముందంజ‌లో కొన‌సాగారు. ఇప్ప‌టి వ‌ర‌కు 14 రౌండ్లు పూర్త‌య్యాయి. హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని హుజూరాబాద్‌, వీణ‌వంక‌, జ‌మ్మికుంట మండ‌లాల్లో కౌంటింగ్ పూర్త‌యింది. ఇక ఇల్ల‌దంకుంట‌, క‌మ‌లాపూర్ మండ‌లాల్లో కౌంటింగ్ చేయాల్సి ఉంది.

ఈట‌ల సొంత మండ‌లం అయిన క‌మ‌లాపూర్ లో భారీ మెజార్టీ వ‌చ్చే ఛాన్స్ క‌న‌ప‌డుతుంది.మొత్తం 22 రౌండ్ల‌లో ఓట్ల‌ను లెక్కించ‌నున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం 14 రౌండ్లు మాత్ర‌మే పూర్త‌య్యాయి. 14 వ రౌండ్‌లో  1046 ఓట్ల  ఆధిక్యమును ఈట‌ల‌ సాధించారు. 14వ రౌండ్‌లో క‌లిపి మొత్తం 9,434 మెజార్టీ ద‌క్కింది. ఇప్ప‌టివ‌ర‌కు బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల 63,079  ఓట్లు వ‌చ్చాయి.  టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీ‌నివాస్‌కు 53, 627,కాంగ్రెస్ అభ్య‌ర్థి బ‌ల్మూరి వెంక‌ట్ కు 1830 ఓట్లు మాత్ర‌మే ద‌క్కాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: