దీపావ‌ళి పండుగ వేళ దేశంలోని ప‌లు రాష్ట్రాల‌ను వ‌రుస భూకంపాలు  గ‌జ గ‌జ వ‌ణికించాయి. మ‌ణిపూర్, అస్సాం, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ వంటి రాష్ట్రాల‌లో భూ ప్ర‌కంప‌న‌ల‌ను గుర్తించారు అధికారులు. మ‌ణిపూర్‌లోని చందేల్ ప్రాంతంలో  ఉద‌యం స‌మ‌యంలో భూకంపం సంభ‌వించిన‌ది. రిక్ట‌ర్ స్కేల్‌పై 3.5 గా న‌మోదు అయిన‌ట్టు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్ల‌డించింది.  భూమికి 52 కిలోమీట‌ర్ల లోతున మెయిరాగ్‌కు ద‌క్షిణ-ఆగ్నేయంగా 57 కిలోమీట‌ర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించిన‌ట్టు పేర్కొన్న‌ది.

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో వరసగా రెండుసార్లు భూప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. ఉదయం 6.25 గంట‌ల స‌మ‌యంలో రిక్ట‌ర్ స్కేల్ పై 2.5 తీవ్రతతో ఒక‌సారి,  అనంత‌రం ఉద‌యం 7.13గంటలకు రిక్ట‌ర్ స్కేలుపై  2.4 తీవ్ర‌త‌తో రెండోసారి భూమి కంపించిన‌ది. అదేవిధంగా అస్సాం రాష్ట్రంలో ఉద‌యం 10.19 గంట‌ల‌కు రిక్ట‌ర్ స్కేల్‌పై 3.7 తీవ్ర‌త‌తో భూకంపం సంభ‌వించిన‌ది. పండుగ వేళ‌లో భూకంపాలు సంభ‌వించ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ప్ర‌భుత్వాలు ఎలాంటి ప్ర‌మాదం లేద‌ని ధైర్యం చెప్పాయి ప్ర‌జ‌ల‌కు.


మరింత సమాచారం తెలుసుకోండి: