దోమకాటు మూలంగా జికా వైరస్ వస్తుంది. ఈ జికా వైరస్‌ను జికా ఫీవర్ లేదా జికా వైరస్ డిసీజ్ అని కూడా పేర్కొంటారు. ప్రపంచంలో ముఖ్యంగా ఇది ట్రాపికల్ మరియు సబ్ ట్రాపికల్ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా సంభవిస్తుంది. చాలా మందిలో ఈ వైరస్‌కు సంబంధించిన ఎలాంటి లక్షణాలు లేకుండానే వస్తుందని వైద్యులు ధృవీకరించారు. కొద్ది మందిలో మాత్రం కొంచెం జ్వరం, మజిల్ పెయిన్స్, కీళ్ళ నొప్పులు, కళ్లు ఎర్రబడడం, అలసట, నీరసం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.
చాలా అరుదైన కేసుల్లో మెదడు లేదా నర్వస్ సిస్టం కాంప్లికేషన్లు కనిపిస్తున్నాయని అంటున్నారు. జికా వైరస్ రాకుండా చూసుకోవడానికి ఒకే ఒక్క దారి ఉంది. ముఖ్యంగా దోమలు కుట్టకుండా, వీలైనంత వరకూ దోమలు రాకుండా చూసుకోవడం లాంటివి చేస్తే ఈ వ్యాధి దరి చేరకుండా ఉంటుంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జికా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 36 మందికి పాజిటివ్ వచ్చినది.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మరో 30మంది జికా వైరస్ బారిన పడ్డారు. దీనితో మొత్తం కేసుల సంఖ్య 66 కు చేరుకున్నదని అక్కడి వైద్యశాఖ వెల్లడించింది. మరోవైపు లక్షణాలు ఉన్న వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. దోమ కుట్టిన 2 నుంచి 14 రోజులకు ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ లక్షణాలు ఉంటే వారం వరకు ఉంటాయని చాలా మంది పూర్తిగా రికవరీ అయిపోతారని వైద్యులు పేర్కొంటున్నారు. ఎవరూ ఈ వైరస్‌కు భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు వెల్లడిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి