విశాఖ‌ప‌ట్ట‌ణం జిల్లా భీమిలి నియోజ‌క‌వ‌ర్గం ఏనుగులపాడులో న‌వంబ‌ర్ 03న చో్టుచేసుకున్న హ‌త్యోదంతం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. దీనికి కార‌ణం ఎవ‌రు..?  ప్ర‌భుత్వంలో కీల‌కంగా ఉన్న ఇద్ద‌రు నాయ‌కుల అంత‌ర్గ‌త పోరునా..?  లేక హ‌త్య ఎవ‌రు చేశారు అనే కోణంలో పోలీసులు ఐదు రోజుల పాటు శ్ర‌మించి ఎట్ట‌కేల‌కు లైన్‌మెన్ హ‌త్య‌కేసులో ప్ర‌ధాన నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడుగా ఉన్న కొరాడ గోవింద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ జిల్లా భీమిలి నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌ద్మ‌నాభం మండ‌లం ఏనుగుల పాలెంలో లైన్‌మెన్ బంగార్రాజు హ‌త్య‌కు గురైన విష‌యం విధిత‌మే. బంగార్రాజు హ‌త్య‌కు ప్ర‌ధానంగా ఆర్థిక లావాదేవీలు అని పోలీసులు అనుమానం వ్య‌క్తం చేశారు. భీమునిప‌ట్నం మండ‌లం న‌మ్మివానిపేట‌కు చెందిన మొల్లి బంగార్రాజు ఆనంద‌పురం మండ‌లం గొట్టిప‌ల్లిలో విద్యుత్ లైన్‌మెన్‌గా విధులు నిర్వ‌హిస్తు ఉండేవాడు.

అయితే ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మేన‌ల్లుడు అయిన కొరాడ ల‌క్ష్మ‌ణ్రావు, ఆయ‌న‌కు స‌న్నిహితంగా ఉండే గోవింద‌రావులు క‌లిసి త‌న భ‌ర్త‌ను హ‌త్య చేశారు అని బంగార్రాజు భార్య నందిని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీక‌రించిన పోలీసులు నిందితుల‌పై ప‌లు కోణాల‌లో విచారించి గోవింద‌రావును అరెస్ట్ చేశారు. మ‌రోవైపు బంగార్రాజు భార్య నందిని, బంధువులు నిందితులను అరెస్ట్ చేసి వెంట‌నే  త‌గిన శిక్ష వేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: