గ‌త కొంత కాలంగా జైలు జీవితం గ‌డిపిన‌ ప్రముఖ న్యూస్ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైన‌ది. సోమవారం సాయంత్రం జైలు నుంచి విడుదల కానున్నట్టు తెలుస్తోంది. ఒక‌ జ్యోతి‌ష్యు‌డిని బ్లాక్‌ మెయిల్‌ చేసి రూ.30 లక్షలు డిమాండ్ చేశారన్న ఆరోపణలతో తీన్మార్ మల్లన్న 2021 ఆగస్టులో అరెస్ట్ చేశారు పోలీసులు.   క్యూ న్యూస్ కార్యాలయంలో  ఆ సమయంలో  సోదాలు జరిపి కొన్ని హార్డ్ డిస్క్‌లు, డాక్యుమెంట్ల‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

ఇప్ప‌టివ‌ర‌కు తీన్మార్ మల్లన్నపై  38 కేసులు నమోదు కాగా.. అందులో 6 కేసులను హైకోర్టు కొట్టివేసింది. మిగతా 32 కేసులో 31 కేసులకు బెయిల్ మంజూరు అయింది. తీన్మార్ మల్లన్న దాదాపు 74 రోజులపాటు జైలులోనే ఉన్నారు. తీన్మార్‌ మల్లన్న భార్య మ‌మ‌త ఇటీవల  తన భర్తపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని   కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సైతం కలిసి ఫిర్యాదు చేశారు. జాతీయ బీసీ కమిషన్ కూడా  మ‌ల్ల‌న్న కేసుల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసిన‌ది. అయితే తాజాగా మల్లన్నకు బెయిల్ మంజూరైన‌ది.


మరింత సమాచారం తెలుసుకోండి: