ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌పై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం పెంచాల‌ని కొంత మంది అధికారులు, ప‌లువురు  రాజ‌కీయ నాయకులు తీవ్రంగా క‌ష్ట‌ప‌డుతున్నారు.  కొంత మంది అధికారులు, రాజ‌కీయ నాయకులు అయితే మ‌రీ ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ నే నీరుగార్చేలా వ్య‌వ‌హ‌రిస్తూ త‌మ ప్రయివేటు సంస్థ‌ల‌ను వృద్ధి చేసుకోవ‌డానికి పాటు ప‌డుతుంటారు ఎక్క‌వ‌గా.  అయితే తాజాగా ఓ జిల్లా క‌లెక్ట‌ర్ త‌న భార్య ప్ర‌స‌వాన్ని ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలోనే చేయించాడు. దీంతో  ప‌లువురు ఆ కలెక్ట‌ర్ పై  ప్ర‌శంసల‌ జ‌ల్లు కురిపిస్తున్నారు.

ఆ క‌లెక్ట‌ర్ మ‌రి ఎవ‌రో కాదు, మ‌న తెలంగాణ రాష్ట్రంలోని భ‌ద్రాద్రి కొత్త‌గూడం జిల్లా క‌లెక్ట‌ర్ అనుదీప్ దురిశెట్టి. ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌పై ప్ర‌జల‌కు విశ్వాసం పెంచాల‌నే ఉద్ధేశంతో నే  ఆయ‌న ఇలా చేశాడ‌ని తెలుస్తోంది.   భ‌ద్రాచ‌లం లోని ప్ర‌భుత్వ ప్రాంతీయ ఆస్ప‌త్రిలో క‌లెక్ట‌ర్ అనుదీప్ దురిశెట్టి మంగ‌ళ వారం భార్య చేరిన‌ది. ఆమె తాజాగా పండంటి మ‌గ శిశువుకు జ‌న్మ‌నిచ్చింది.  ప్ర‌స్తుతం త‌ల్లి, బిడ్డ‌లు ఇద్ద‌రూ కూడా క్షేమంగా ఉన్నార‌ని ప్ర‌భుత్వ ఆసుప‌త్రి వైద్యులు  వెల్ల‌డించారు.  తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాకు చెందిన అనుదీప్ దురిశెట్టి 2017 లో జ‌రిగిన సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌లో దేశంలోనే మొదటి ర్యాంక్  ఘ‌న‌త సాధించి విజ‌యాన్ని త‌న‌ సొంతం చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాకు కలెక్ట‌ర్‌గా విధులు నిర్వ‌హిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: