న‌కిలీ ఇన్‌పుట్ టాక్స్ మోసానికి పాల్ప‌డిన ఐదుగురు అరెస్ట్ చేసిన ఘ‌ట‌న విశాఖ‌ప‌ట్ట‌ణంలో చోటు చేసుకున్న‌ది. అత‌ని వ‌ద్ద నుంచి దాదాపు రూ.31 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. హైద‌రాబాద్‌కు చెందిన వ్య‌క్తి నుంచి 20 నకిలి కంపెనీ రూపొందించి రూ.265 కోట్ల‌కు ఇన్‌వాయిస్‌, న‌కిలీ ఐటీసీని పాస్ట్ చేయ‌డం ద్వారా ల‌బ్ది పొందాడు. గుంటూరు, హైద‌రాబాద్ ల‌ను కేంద్రంగా చేసుకుని మోసానికి పాల్ప‌డ్డారు.  

దాదాపు సంవ‌త్స‌ర కాలంలో విశాఖ‌ప‌ట్ట‌ణం, ఓడీజీజీఐ, 180 న‌కిలీ కంపెనీలు, 160 కోట్ల రూపాయ‌ల మోసాల‌ను గుర్తించారు. 5 గురు వ్య‌క్తులు అరెస్ట‌య్యారు. 60 కోట్ల  న‌గదును రీక‌వ‌రి చేసారు.  న‌కిలీ కంపెనీ వ్య‌వ‌హారాలు ఈ మ‌ధ్య కాలంలో విచ్ఛ‌ల‌విడిగా చెల‌రేగిపోతున్నాయి. ముఖ్యంగా పోలీసులు సుల‌భంగా డ‌బ్బు సంపాదించాల‌నే ఆశ‌తోనే ఇలాంటి వాటికి పాల్ప‌డుతున్నార‌ని పోలీసులు పేర్కొంటున్నారు. పోలీసులు నిఘా పెట్టి ఎంత అరిక‌ట్టాల‌ని చూసినా కానీ వారి దందా మాత్రం కొన‌సాగుతుంద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: