ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో భాగంగా ఇవాళ ఉద‌యం 7 గంటల నుంచే ఎన్నిక‌లు ప్రారంభ‌మ‌య్యాయి.  ఇప్ప‌టి వ‌ర‌కు  దాదాపు కృష్ణా జిల్లాలో ఎన్నిక‌లు ప్ర‌శాతంగా సాఫీగానే సాగుతున్నాయి. అయితే ముఖ్యంగా క‌లెక్ట‌ర్ జె నివాస్ పోలింగ్ ప్ర‌క్రియ‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.  కొండ‌ప‌ల్లిలో ఉన్న 29 వార్డుల‌లో 56 పోలింగ్ కేంద్రాల‌లో 57,543 మంది ఓట‌ర్లు, అదేవిధంగా జ‌గ‌య్య‌పేట‌లో 31 వార్డుల‌లో 62 పోలింగ్ కేంద్రాల‌లో క‌లిపి 42,715 మంది ఓట‌ర్లు ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు.

కొండ‌ప‌ల్లిలో 13.85 పోలింగ్ న‌మోదు అవ్వ‌గా,జ‌గ్గ‌య్య‌పేట‌లో మాత్రం 16.53 శాతం ఓట‌ర్లు ఇప్ప‌టివ‌ర‌కు త‌మ ఓటు హ‌క్కుని వినియోగించుకున్నారు. క‌రోనా నేప‌థ్యంలో పోలింగ్ కేంద్రాల వ‌ద్ద త‌గు జాగ్ర‌త్త‌లు పాటిస్తున్నారు అధికారులు. ఓట‌ర్లు కూడ నిబంధ‌న‌లు పాటించే పాల్గొంటున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జ‌రుగనున్న‌ది. ఈనెల 17 అన‌గా బుధ‌వారం ఉద‌యం 8 గంట‌ల నుంచి ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ కొన‌సాగ‌నున్న‌ది.

.


మరింత సమాచారం తెలుసుకోండి: