ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నెల్లూరు మున్సిపల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో మొత్తం  54 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ అభ్యుర్థులను గెలిపించారు ఓట‌ర్లు. దీంతో నెల్లూరులో టీడీపీపై వ్య‌తిరేక‌త నెల‌కొన్న‌ద‌ని  మంత్రి అనీల్ కుమార్ యాద‌వ్ పేర్కొన్నారు. మిగిలిన టీడీపీ 19 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి గెల‌వాల‌ని స‌వాల్ విసిరారు.

అయితే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అపజయంతో టీడీపీ నేత కప్పిర శ్రీనివాసులు అర్ధ గుండు,  మీసం చేయించుకున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ ఓడిపోతే అర్ధ‌గుండు చేయించుకుంటాన‌ని పేర్కొన్న క‌ప్పిర ఇవాళ అదే ప‌ని చేశాడు.  ముఖ్యంగా జగన్ పోవాలి - బాబురావాలి అనే నినాదంతో జగన్ ప్రభుత్వం పోయేంత వరకు అర్ధ గుండు, సగం మీసంతో తిరుగుతాను అని స్ప‌ష్టం చేశారు. 49, 50 డివిజన్లలో నన్ను ఓడించేందుకు మంత్రి అనిల్, ఆయన సోదరులు, కుమార్, అశ్వినీ కుమార్ లు తిరిగి  దాదాపు రూ.3కోట్లు ఖర్చు  చేసారు. పోలీసులు, అధికారులు ఏకపక్షంగా వ్యవహారించి టీడీపీ ఓటమికి పనిచేశారని టీడీపీ నేత క‌ప్పిర శ్రీ‌నివాసులు వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: